Monday, July 7, 2025

మ‌హేశ్ బాబుకు క‌న్స్యూమ‌ర్ ఫోరం నోటీసులు

Must Read

టాలీవుడ్ న‌టుడు మహేష్ బాబుకు కన్స్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది. గ‌త ఏప్రిల్‌లో సాయి సూర్య డెవలపర్స్ విష‌యంలో ఫిర్యాదు అందిన విష‌యం తెలిసిందే. దీనికి ప్ర‌చార క‌ర్త‌గా ఉన్న మ‌హేశ్‌ను ఆ ఫిర్యాదులో మూడవ ప్రతివాదిగా చేర్చారు. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయి, బాలాపూర్‌లో ఒక ప్లాట్ కోసం సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు రూ.34.8 ల‌క్ష‌లు చెల్లించామని ప‌లువురు బాధితులు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల తరువాత అసలు లేఅవుట్ లేదని తెలిసి డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే, కేవలం రూ.15 లక్షలు చెల్లించారని, తమకు న్యాయం చేయాలని కన్స్యూమర్ ఫోరంలో పిటిషన్ దాఖలు చేసి కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహేష్ బాబును, రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులను విచారణకు హాజరు కావాలని రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

కేర‌ళ‌లో నిఫా వైర‌స్‌తో ఇద్ద‌రి మృతి

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెంద‌డం ఆందోళ‌న‌కు క‌లిగిస్తోంది. నిఫా వైరస్ సోకి రాష్ట్రంలో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -