సోషల్ మీడియాలో వేధింపులకు హద్దు అదుపూ లేకుండా పోతోంది. ఏకంగా హైకోర్టు జడ్జికి సైతం వేధింపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తనపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ హైకోర్ట్ జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. తనను గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ సదరు హైకోర్టు న్యాయమూర్తి ఏకంగా తనను ట్రోలింగ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం వ్యవస్థలను ఏరకంగా దెబ్బతీస్తుందో అర్థం అవుతుంది. న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా వ్యవహరించకూడదని, చట్టం ప్రకారం పనిచేయకూడదని అన్నట్లుగా పలువురు పోస్టులు పెట్టడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.