Sunday, July 6, 2025

హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు

Must Read

హైద‌రాబాద్ మెట్రో యాజ‌మాన్యం న‌గ‌ర‌వాసుల‌కు షాక్ ఇచ్చింది. మ‌రోసారి చార్జీలు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మెట్రో రూ.6,500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు ఎల్అండ్ టీ సంస్థ‌ తెలిపింది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్ల‌డించింది. కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపున‌కు సుముఖత చూపకపోవడంతో వాయిదా వేసిన‌ట్లు పేర్కొంది. కానీ ఇప్పుడు చార్జీల పెంపు తథ్యమని చెప్తున్నారు. ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో సంస్థ ఆలోచిస్తున్న‌ది. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు, మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్ ఎత్తివేశారు. దీంతో చార్జీలు ఎంత మేర పెరుగుతాయోన‌ని ప్ర‌యాణికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -