తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ICC మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన త్రిషకు రేవంత్ రెడ్డి రూ.కోటి నజరానా ప్రకటించారు. మరో క్రికెటర్ ధ్రుతి కేసరికి రూ.10 లక్షలు ప్రకటించారు. కాగా, భారత్ కప్ గెలవడంతో త్రిష కీలక పాత్ర పోషించింది.