మహిళల U-19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలోనే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు భారత్ ప్లేయర్లు స్థానం దక్కించుకున్నారు. గొంగడి త్రిష, జి. కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించారు. సౌతాఫ్రికా క్రికెటర్ కైలా రేనెకేను కెప్టెన్‌గా మొత్తం 12 మందితో టీమ్‌ను ఐసీసీ ప్రకటించింది.