పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. ఈ పథకానికి కేంద్రమాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేరు వచ్చేలా మార్పులు చేయాలని నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయంతో నీటిపారుదల శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ పథకానికి ‘ఎస్. జైపాల్‌రెడ్డి పీఆర్ఎల్ఐ’ (పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం) పేరును పెట్టారు.