Saturday, August 30, 2025

నిజామాబాద్‌లో పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి

Must Read

నిజామాబాద్‌ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. ఈ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దానికి ఛైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -