తన తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావడంపై నటి రేణూ దేశాయ్ స్పందించారు. ‘నేను ఎక్కడికి వెళ్లినా నాకు ఎదురయ్యే ప్రశ్న అకీరా ఎంట్రీ గురించే. అందరి కంటే ఎక్కువగా ఒక తల్లిగా నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. కాకపోతే అది పూర్తిగా అతడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాడు.’ అని రేణు దేశాయ్ తెలిపారు.