Monday, January 6, 2025

ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం

Must Read

ఇటీవల కాలంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. గురువారం రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో సెకన్‌ పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాంతంలోనే పలుమార్లు భూకంపం రావడంతో ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే అధికారులు పరిశోధనలు చేశారు.

డిసెంబర్ 21, 22వ తేదీల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలో వరుసగా ఉదయం 10:35 నుంచి 10:40 గంటల మధ్య కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది. ముండ్లమూరు, శింగన్నపాలెం, వేంపాటు, పెద్దఉల్లగల్లు, పసుపుగల్లు గ్రామాల్లో భూమి కంపించిందని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఇదే మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించడం ఆందోళనకు గురి చేస్తుందని స్థానికులు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

భారత్‌లో విజృంభిస్తున్న HMPV వైరస్

భారత్‌లో HMPV వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజే దేశంలో నాలుగు HMPV వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు HMPV వైరస్ కేసులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -