మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా మేజిక్ ఫిగర్ 145 సీట్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రంలో మహాయుతి(బీజేపీ, శివసేన(ఏక్ నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్)) 82 సీట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహావికాస్ అఘాడీ(కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ(శరద్ పవార్)) 30 సీట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక జార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా మేజిక్ ఫిగర్ 41 సీట్లు. ప్రస్తుతం ఎన్డీఏ అక్కడ లీడ్ లో ఉంది. కాంగ్రెస్ వెనుకంజలో ఉంది.