రైతు భరోసా(రైతు బంధు) పథకంపై కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పథకంపై సబ్ కమిటీ వేశామని, తుది నివేదిక వచ్చిన తర్వాతే రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ లో రైతు భరోసా ఇవ్వలేమని పరోక్షంగా పేర్కొన్నారు. రాబోయే పంటకాలం నుంచి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాగా, ఎకరాకు రూ.15వేల రైతు భరోసా ఇస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.