Saturday, March 14, 2026

జగన్ తిరుమల పర్యటన రద్దు

Must Read

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయింది. చంద్రబాబు లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాప ప్రక్షాళన చేయాలని వైఎస్ జగన్ భావించారు. కానీ జగన్ పై దాడికి కుట్ర పన్నారని పార్టీ వర్గాల నుంచి తెలియడంతో పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మునుపెన్నడూ లేని విధంగా తిరుపతి, తిరుమలలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. పోలీస్ యాక్ట్ 30 ని తెరపైకి తెచ్చారు. ఒక రోజు ముందు నుంచే వైసీపీ కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని తద్వారా పర్యటనను అడ్డుకోవాలని కూడా కొందరు భావించారు. చివరికి, జగన్ పర్యటన రద్దు అయ్యేలా చేశారు. కాసేపట్లో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -