Thursday, September 19, 2024

భారతీయలు స్పైసీ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడటానికి కారణాలు?

Why are some of us more drawn to spicy food? Dive into the psychology behind this preference.

Must Read

ఒక్కొక్కరి హాబీలు ఒక్కోలా ఉంటాయి. కొందరు టైమ్ దొరికితే క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి గేమ్స్ ఆడుతుంటారు. మరికొందరు సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తారు. ఇంకొందరేమో కాస్త గ్యాప్ దొరికినా బైక్, కారు వేసుకొని ట్రిప్స్ కు బయల్దేరతారు. ఇలా ఫ్రీ టైమ్ లో తమకు నచ్చింది, తోచింది చేస్తుంటారు. అయితే కొందరికి మాత్రం ఫుడ్ అంటే బాగా ఇష్టం. అందుకే ఖాళీ సమయాల్లో గరిటె తిప్పుడూ కొత్త వంటకాలను చేస్తూనో లేదా నూతన రుచుల్ని తింటూ, ఆస్వాదిస్తూ ఉంటారు. ఇలాంటి ఫుడ్ లవర్స్ లో కొందరికి స్పైసీ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది.

ఈ రోజుల్లో చాలా మంది స్పైసీ ఫుడ్ తీసుకోవడాన్ని చూస్తూనే ఉన్నాం. ఇతర దేశాలతో పోలిస్తే ఈ రకమైన ఆహారాన్ని అమితంగా ఇష్టపడేవారిలో భారతీయులు ముందంజలో ఉన్నారని నిపుణులు అంటున్నారు. కాస్త కారం, మసాలా తక్కువైతే ఇంట్లో వారితో గొడవ పడే వాళ్లు మన దేశంలో ఎక్కువే. మనలో కొందరికి కారం, మసాలా అధికంగా ఉన్న ఆహారాలు లేదా స్పైసీ ఫుడ్ తీసుకోవడం అంటే ఇష్టం. ఏది తినాలన్నా కాస్త స్పైసీగా ఉండకపోతే బోజనం తీసుకోవడానికి ఇష్టపడని వారినీ చూసే ఉంటారు. అయితే ఇలా స్పైసీ ఫుడ్ ఇష్టపడటం వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయని సైంటిస్టులు అంటున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

హ్యాపీ హార్మోన్స్
స్పైసీ ఫుడ్స్ ను కొందరు అతిగా ఇష్టపడటం వెనుక కొన్ని మానసిక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వీటిని భోజనంలో భాగంగా తీసుకుంటే మాసినక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. హ్యాపీ హార్మోన్స్ గా పిలిచే ఎండార్ఫిన్స్ ను స్పైసీ ఫుడ్స్ రిలీజ్ చేస్తాయని రీజెన్సీ హాస్పిటల్ లో సైక్రియాట్రిక్ కన్సల్టెంట్ గా ఉన్న డాక్టర్ రోహన్ కుమార్ తెలిపారు. సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్స్ విడుదలవడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ నుంచి ఉపశమనం లభించి.. మనసు తేలిగ్గా మారుతుందని చెప్పారు.

వాళ్లే ఎక్కువగా తీసుకుంటున్నారు
స్పైసీ ఫుడ్స్ లో ఉండే సుగంధ ద్రవ్యాలు నోట్లోని గ్రాహకాలను ఉత్తేజితం చేస్తాయని జనరల్ ఫిజీషియన్ అయిన డాక్టర్ శుచిన్ బజాజ్ అన్నారు. దీని వల్ల ఎండార్ఫిన్స్ ఉత్పత్తి అవడంతో పాటు ఎక్సైట్ మెంట్, థ్రిల్ ను కలిగిస్తాయని పేర్కొన్నారు. డిఫరెంట్ ఫుడ్ ను టేస్ట్ చేయాలనుకునేవారు ఇలాంటి ఆహార పదార్థాలను తమ భోజనంలో ఎక్కువగా చేర్చుకుంటారని చెప్పుకొచ్చారు. తినే ఆహారం విషయంలో సాంస్కృతిక నేపథ్యం, సామాజిక పరిస్థితులు కూడా బలంగా ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. స్పైసీ ఫుడ్స్ ను అధికంగా తీసుకోవడానికి దాని వల్ల వచ్చే రుచి కూడా ఒక కారణమని చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -