Thursday, January 2, 2025

జైల్లో ఉన్న మహిళకు నోబెల్! ఆమెకే ఎందుకు?

Iranian activist Narges Mohammadi awarded Nobel Peace Prize

Must Read

ప్రపంచంలో అత్యుత్తమంగా భావించే అవార్డుల్లో నోబెల్ ముందు వరుసలో ఉంటుంది. అందులోనూ నోబెల్ శాంతి పురస్కారానికి ఉండే పాపులారిటీ వేరు. అలాంటి ఈ అవార్డును ఈ ఏడాది ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మది దక్కించుకున్నారు. మహిళల అణచివేతకు వ్యతిరేకంగా నార్గిస్ చేసిన పోరాటానికి గానూ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. హ్యూమన్ రైట్స్, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛను కల్పించేందుకు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న ఆమె ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సంప్రదాయం పేరు మీద స్త్రీలకు అనేక ఆంక్షలు విధించే ఇరాన్ వంటి దేశంలో పుట్టిన నార్గిస్.. చదువుకునేటప్పటి నుంచే విమెన్ రైట్స్ పై గళమెత్తారు.

వెనకడుగే తెలీదు

ఇంజినీరింగ్ పూర్తయిన అనంతరం కొన్నాళ్లు వార్తా పత్రికలకు కాలమిస్ట్ గా నార్గిస్ పనిచేశారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత షిరిన్ ఇబాది నెలకొల్పిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (డీహెచ్ఆర్సీ) సెంటర్ లో 2003లో జాయిన్ అయి.. ఆ తర్వాత అదే సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా ఆమె బాధ్యతలు చేపట్టారు. మానవ హక్కుల కోసం సొంత దేశం ఇరాన్ లో ఆమె చేస్తున్న పోరాటంలో ఎన్నోసార్లు కఠిన సవాళ్లు ఎదుర్కొన్నారు. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. హక్కులపై పోరాటంలో ఏకంగా 13 సార్లు అరెస్ట్ అయ్యారు నార్గిస్. 1998లో ఇరాన్ గవర్నమెంట్ ను విమర్శించినందుకు గానూ మొదటిసారి అరెస్టయి ఏడాది పాటు జైలు శిక్షను అనుభవించారు. అనంతరం డీహెచ్ఆర్సీలో చేరినందుకు గానూ మరోమారు ఆమె అరెస్ట్ అయ్యారు.

జైల్లోనూ మద్దతు

జైలులోనే నార్గిస్ ఉద్యమం చేపట్టడం గమనార్హం. రాజకీయ ఖైదీలు, మహిళలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా ఆమె జైలులో ఉద్యమం స్టార్ట్ చేశారు. అక్కడా ఆమెను సపోర్ట్ చేసే వారి సంఖ్య పెరగడంతో అధికారులు నార్గిస్ పై కఠిన ఆంక్షలు విధించారు. ఎవరితోనూ ఆమె ఫోన్లో మాట్లాడకుండా, కలవకుండా నిషేధించారు. అయినా ఆమె తన పోరాటాన్ని కొనసాగించారు. ఇలా దేన్నీ లెక్క చేయకుండా మానవ హక్కులు, మహిళలపై ఆంక్షలకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం, జైలులోనూ ఉద్యమం చేయడం, ప్రజాజీవితానికి అంకితమవ్వడం నోబెల్ పురస్కారానికి నార్గిస్ ను ఎంపికయ్యేలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హాస్టల్‌లో బాత్‌రూమ్ వీడియోలు.. విచారణకు మహిళా కమిషన్ ఆదేశం

మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో రహస్య వీడియోలు రికార్డు చేయడం కలకలం రేపుతున్నాయి. హాస్టల్‌ బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌పై చేతి గుర్తులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -