Monday, October 20, 2025

ఏపీ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తులు

Must Read

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ దొనడి రమేష్, కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్ సుబేందు సమంత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ ముగ్గురిలో జస్టిస్ రాయ్ 2వ స్థానంలో, జస్టిస్ రమేష్ 6వ స్థానంలో, జస్టిస్ సుబేందు 18వ స్థానంలో ఉంటారు. వీరు వెంటనే ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. జస్టిస్ రాయ్ మరియు జస్టిస్ రమేష్ 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి గుజరాత్ మరియు అలహాబాద్ హైకోర్టులకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి వారు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ సుబేందు సమంత కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 25న ఈ బదిలీలకు సిఫారసు చేసింది. ఇదే సమయంలో, న్యాయాధికారుల కోటా నుంచి ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన జడ్జిగా ఉన్న గంధం సునీత, విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆలపాటి గిరిధర్, రాష్ట్ర జుడీషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం ఈ పదోన్నతులు అందుకోనున్నారు. హైకోర్టు కొలీజియం ఈ ముగ్గురి పేర్లను సిఫారసు చేసింది. కేంద్ర హోమ్ శాఖ నుంచి ఇంటెలిజెన్స్ నివేదిక అందిన వెంటనే సుప్రీంకోర్టు కొలీజియం వీరి నియామకంపై తుది నిర్ణయం తీసుకోనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -